Lord Venkateswaradevotionallyrics

Tirumala Tirupati Venkatesha

Complete lyrics with original text, transliteration, and meaning, 8 sections

Share:

Original

పల్లవి : తిరుమల తిరుపతి వెంకటేశ స్వామి, మా ఇంటి దేవుడవు శ్రీనివాస 2 శ్రీనివాసా... మా వెంకటేశా... మా బంగారు తండ్రి నీవే గోవిందా మా బంగారు తండ్రి నీవే గోవిందా తిరుమల తిరుపతి వెంకటేశ స్వామి, మా ఇంటి దేవుడవు శ్రీనివాస 2

Verse 2

Original

చరణం 1: వరములను ఇచ్చేటి స్వామి వెంకటేశ, వైకుంఠ వాసుడవు శ్రీనివాసా 2 మా కష్ట సుఖము నీవే వెంకటేశ, కడతేర్చ రావయ్య శ్రీనివాస 2 తిరుమల తిరుపతి వెంకటేశ స్వామి, మా ఇంటి దేవుడవు శ్రీనివాసా

Verse 3

Original

చరణం 2: నీ పూజ సేవలన్నీ స్వామి వెంకటేశ, చేయంగ వచ్చినాము శ్రీనివాసా 2 నీ రూపం చూడ స్వామి వెంకటేశ, నీ వాకిట నిలిచాము శ్రీనివాస 2 తిరుమల తిరుపతి వెంకటేశ స్వామి, మా ఇంటి దేవుడవు శ్రీనివాస

Verse 4

Original

చరణం 3: జగములు సల్లంగ స్వామి వెంకటేశ, పాలించ రావయ్య శ్రీనివాస 2 గోవింద నామము స్వామి వెంకటేశ, మేమంతా పలికేము శ్రీనివాస 2 తిరుమల తిరుపతి వెంకటేశ స్వామి, మా ఇంటి దేవుడవు శ్రీనివాస

Verse 5

Original

చరణం 4: మనసారా కొలిచేము నిన్నే వెంకటేశ, కోనేటి రాయుడా శ్రీనివాస 2 నీ భజన చేసి స్వామి వెంకటేశ, నిన్నెంతో తలచేము శ్రీనివాస 2 తిరుమల తిరుపతి వెంకటేశ స్వామి, మా ఇంటి దేవుడవు శ్రీనివాస

Verse 6

Original

చరణం 5: సిరిగల్ల దేవుడు నీవే వెంకటేశ, మా పాలి దైవంబు నీవయ్య 2 నీ మహిమ మాకు స్వామి వెంకటేశ, చూపంగ రావయ్య శ్రీనివాస 2 తిరుమల తిరుపతి వెంకటేశ స్వామి, మా ఇంటి దేవుడవు శ్రీనివాస

Verse 7

Original

చరణం 6: నీ ఏడు కొండలు స్వామి వెంకటేశ, ఎక్కినాము మా తండ్రి శ్రీనివాస 2 నీ దర్శన భాగ్యము స్వామి వెంకటేశ, మాకు నీవు కలిగించు శ్రీనివాస 2 తిరుమల తిరుపతి వెంకటేశ స్వామి, మా ఇంటి దేవుడవు శ్రీనివాస

Verse 8

Original

చరణం 7: కలియుగ వాసుడు నీవే వెంకటేశ, మా కర్మ పాపాలు తొలగించు 2 జయ సింధూర్ వారిని స్వామి వెంకటేశ, కరుణించి కాపాడు శ్రీనివాస 2 తిరుమల తిరుపతి వెంకటేశ స్వామి, మా ఇంటి దేవుడవు శ్రీనివాస 2 శ్రీనివాసా... మా వెంకటేశా... మా బంగారు తండ్రి నీవే గోవిందా మా బంగారు తండ్రి నీవే గోవిందా తిరుమల తిరుపతి వెంకటేశ స్వామి, మా ఇంటి దేవుడవు శ్రీనివాస 2

Bhandhavi

Related Bhajans & Aartis

Get the daily panchang & festival updates

Join our free newsletter, no spam, unsubscribe anytime.