otherhindi

Lalitha Priya

Artist: Ilaiyaraaja

Share:

Lalitha Priya

Tap to play

Lyrics with Meaning

View lyrics page →

Original

లలిత ప్రియ కమలం విరిసినది లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని ఉదయ రవి కిరణం మెరిసినది

Verse 2

Original

అమృత కలశముగా ప్రతి నిమిషం అమృత కలశముగా ప్రతి నిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది లలిత ప్రియ కమలం విరిసినది

Verse 3

Original

రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం నేల నింగి కలిపే బంధం ఇంద్రఛాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం కలల విరుల వనం మన హృదయం కలల విరుల వనం మన హృదయం వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను తీపి పలుకుల చిలుకల కిలకిల తీగ సొగసుల తొణికిన మిలమిల పాడుతున్నది ఎద మురళి రాగ ఝరి తరగల మృదురవళి తూగుతున్నది మరులవని లేత విరి కులుకుల నటనగని వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఉదయ రవి కిరణం మెరిసినది

Verse 4

Original

కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజాకుసుమం మనసు హిమగిరిగా మారినది మనసు హిమగిరిగా మారినది కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతికాగ మేని మలుపుల చెలువపు గమనము వీణ పలికిన జిలిబిలి గమకము కాలి మువ్వగ నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం స్వాగతించెను ప్రేమ పథం సాగినది ఇరువురి బ్రతుకు రథం కోరికల తారకల సీమలకు చేరుకొనె వడివడి పరువిడి ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని లలిత ప్రియ కమలం విరిసినది

Ilaiyaraaja

Get the daily panchang & festival updates

Join our free newsletter, no spam, unsubscribe anytime.